స్టైలిష్ లుక్స్ తో మోసగాళ్ళకు ‘మొనగాడు’గా మారిన సుధీర్ బాబు

sudeerbabu

ప్రేమకధా చిత్రమ్ మినహా వరుసపెట్టి డిజాస్టర్ లను ఎదుర్కున్న సుధీర్ బాబు ఈసారి తన అదృష్టాన్ని ‘మోసగాళ్ళకు మోసగాడు’ సినిమా ద్వారా పరీక్షించుకోనున్నాడు. ఈ సినిమాకోసం సుధీర్ అహర్నిశలు కష్టపడుతున్నాడు. ఇటీవలే విడుదల చేసిన పోస్టర్ లలో తనని తానూ మార్చుకున్న విధానం స్పష్టంగా కనిపిస్తుంది.

స్వామి రారా నిర్మాణ బృందం నుండి వస్తున్న ఈ సినిమాకు మంచి ప్రీ రిలీజ్ టాక్ సంతరించుకుంది. ఏ.ఎన్ బోస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నందిని హీరోయిన్.

చిత్రీకరణలో చివరిదశకు చేరుకున్న ఈ సినిమా ఆడియోని ఏప్రిల్ లో, విడుదలని మే లో ప్లాన్ చేసుకున్నారు.

Exit mobile version