“వి”లో అట్రాక్షన్ గా సుధీర్ బాబు యాక్షన్ పార్ట్.!

“వి”లో అట్రాక్షన్ గా సుధీర్ బాబు యాక్షన్ పార్ట్.!

Published on Aug 26, 2020 2:23 PM IST

Sudheer

ఈ మధ్య కాలంలో మన దక్షణాది నుంచి వచ్చిన చిత్రాల్లో డైరెక్ట్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ లోకి వచ్చిన వాటిలో మోస్ట్ అవైటెడ్ చిత్రంగా నిలిచింది మాత్రం ”వి” అని చెప్పాలి. ఈ చిత్రాన్ని డిజిటల్ రిలీజ్ గా అనౌన్స్ చేసినప్పటి నుంచి మన వాళ్ళు చాలా ఆసక్తిగా ఈ చిత్రం కోసం ఎదురు చూసారు. అలాగే ఈలోపునే ఈ చిత్రం ట్రైలర్ కోసం కూడా రచ్చ చేసారు. ఇక ట్రైలర్ విడుదలయ్యింది, మంచి రెస్పాన్స్ ను కూడా అందుకుంది.

అయితే ఈ చిత్రంలో నాని యాంటీ హీరోగా సుధీర్ బాబు హీరోగా కనిపిస్తున్నారు. ఈ ట్రైలర్ ను కనుక గమనించినట్లయితే క్రైమ్ ఎలిమెంట్స్ కన్నా ఒక పవర్ ప్యాకెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా అనిపించింది అని చెప్పాలి. దీనికి కూడా ప్రధాన కారణం సుధీర్ బాబు అని చెప్పొచ్చు.ట్రైలర్ లోని సుధీర్ బాబుపై వచ్చిన కొన్ని షాట్స్ లో చూస్తే సుధీర్ బాబు మాసివ్ ఫిజిక్ సిక్స్ ప్యాక్ లుక్స్ లో కనిపించిన యాక్షన్ ఎఎపిసోడ్స్ కానీ అతని హార్డ్ వర్క్ సుస్పష్టంగా కనిపిస్తుంది.

అలాగే ఈ చిత్రంలో ఈ ఎపిసోడ్ కూడా మరో అట్రాక్షన్ గా కూడా నిలిచే అవకాశం ఉందని చెప్పడంలో కూడా ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే పలు చిత్రాల్లో తన స్టన్నింగ్ లుక్స్ మరియు యాక్షన్ ఎపిసోడ్స్ తో ఆకట్టుకున్న సుధీర్ బాబు కెరీర్ లో ఈ వి చిత్రంలో ఈ సీక్వెన్స్ కూడా ఒక బెంచ్ మార్క్ లా నిలవడం ఖాయం అని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు