వాయిదా పడిన “హరోమ్ హర”…కొత్త రిలీజ్ డేట్ ఇదే!

వాయిదా పడిన “హరోమ్ హర”…కొత్త రిలీజ్ డేట్ ఇదే!

Published on May 21, 2024 12:01 PM IST

జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో సుధీర్ బాబు ప్రధాన పాత్రలో నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ హరోమ్ హర ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ముఖ్యంగా సుధీర్ బాబు బర్త్ డే సందర్బంగా విడుదల చేసి సునీల్ తో తన స్నేహాన్ని చాటుకున్న మురుగన్ పాట ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇంతలో, మేకర్స్ కొత్త విడుదల తేదీని ప్రకటించారు. ముందుగా మే 31న ఈ చిత్రం ను విడుదల చేయాలని భావించారు. ఇప్పుడు ఈ చిత్రం జూన్ 14కి వాయిదా పడింది.

సుధీర్ బాబు చేతిలో తుపాకీతో ఉన్న పోస్టర్ ద్వారా మేకర్స్ ఈ వార్తను అధికారికంగా ప్రకటించారు. జూన్ 14న హరోమ్ హర సోలోగా విడుదల కానుంది. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ పతాకంపై సుమంత్ జి నాయుడు నిర్మిస్తున్న ఈ సినిమాలో మాళవిక శర్మ కథానాయికగా నటిస్తోంది. హరోమ్ హర 1989లో చిత్తూరు జిల్లా కుప్పం నేపథ్యంలో సాగే పీరియాడికల్ ఫిల్మ్. చైతన్ భరద్వాజ్ ఈ చిత్రంకి సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు