
ఏ.ఎన్ బోస్ దర్శకత్వంలో సుధీర్ బాబు ఒక కొత్త చిత్రంలో నటిస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు ‘మోసగాళ్ళకు మోసగాడు’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఈ చిత్రాన్ని ‘స్వామి రారా’ నిర్మాతలు నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రం బ్యాంకాక్ లో ఒక షెడ్యూల్ ని పూర్తిచేసుకుంది.
‘మోసగాళ్ళకు మోసగాడు’ సినిమా సూపర్ స్టార్ కృష్ణ నటించిన సూపర్ హిట్ మూవీ టైటిల్ కావడం విశేషం. తెలుగులో మొదటి కౌ బాయ్ సినిమాగా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ కోవకే మహేష్ ‘టక్కరి దొంగ’ కూడా చెందుతుంది.

