వైరల్: మహేష్, రాజమౌళి ప్రాజెక్ట్ పై సుధీర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

వైరల్: మహేష్, రాజమౌళి ప్రాజెక్ట్ పై సుధీర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Published on May 21, 2024 7:05 PM IST

ప్రస్తుతం మన ఇండియన్ సినిమా నుంచి రానున్న బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ లలో పాన్ వరల్డ్ ఆడియెన్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారీ చిత్రం క్రేజీ కాంబినేషన్ సూపర్ స్టార్ మహేష్ (Mahesh Babu) అలాగే దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి (Rajamouli) ల కాంబినేషన్ (SSMB 29) అని చెప్పాలి.

మరి ఈ భారీ చిత్రం ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఈ చిత్రంపై టాలీవుడ్ హీరో నైట్రో స్టార్, మహేష్ కుటుంబీకుడు సుధీర్ బాబు చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్ గా మారాయి. రాజమౌళి, మహేష్ ల కాంబో పర్ఫెక్ట్ టైం లో పడింది అని, ఇద్దరూ మంచి పీక్ లో ఉన్న సమయం ఇది. ఇదే కాంబినేషన్ ఒక ఐదారేళ్లు కితం వచ్చుంటే ఇంకోలా ఉండేది ఏమో అని తెలిపాడు.

అలాగే ఈ చిత్రం కోసం కొన్ని సార్లు మాత్రమే డిస్కషన్ మాలో వచ్చింది అని మహేష్ ఈ సినిమా కోసం మూడేళ్లు కేటాయిస్తున్నట్టుగా ప్లానింగ్స్ లో ఉన్నారని, సీక్వెల్ ఉందా లేదా అనేది మాత్రం నాకు తెలీదని సుధీర్ బాబు తన సైడ్ నుంచి ఈ క్రేజీ కాంబినేషన్ సంబంధించిన అప్డేట్ అందించాడు. ఇక సుధీర్ బాబు హీరోగా నటించిన చిత్రం “హరోం హర” ఈ జూన్ లో రిలీజ్ కి రాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు