నివేదా – రెజీనా సినిమా ఉంటుందా ?

Published on May 31, 2020 3:00 am IST

సుధీర్ వర్మ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ కొరియన్ చిత్రం ‘మిడ్ నైట్ రన్నర్స్’ను రీమేక్ చేయబోతున్నారని వార్తలు వచ్చాయి. ఈ సినిమాలో నివేదా థామస్, రెజీనా కసాండ్ర ప్రధాన పాత్రలుగా నటిస్తున్నారు. ఈ ఇద్దరూ సినిమాలో పోలీస్ పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ ఇద్దరూ కొరియన్ యాక్షన్ కొరియోగ్రఫర్ల వద్ద శిక్షణ కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇదొక యాక్షన్ కామెడీ ఎంటెర్టైనర్. కాగా ఈ సినిమా ఉంటుందా ? చిత్రబృందం ఎప్పుడో షూట్ స్టార్ట్ చెయ్యాలని అనుకున్నప్పటికీ.. కరోనాతో పోస్ట్ ఫోన్ అయింది. అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా క్యాన్సల్ అయినట్లు తెలుస్తోంది, మరి ఈ సినిమా ఉంటుందా లేదా అనేది తెలియాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం :

More