ఆహా వారి ‘సర్కార్ సీజన్ 4’ హోస్ట్ గా సుడిగాలి సుధీర్

ఆహా వారి ‘సర్కార్ సీజన్ 4’ హోస్ట్ గా సుడిగాలి సుధీర్

Published on Apr 3, 2024 12:36 AM IST

ప్రముఖ తెలుగు ఓటిటి ప్లాట్ ఫామ్ అయిన ఆహా వారు అటు పలు సినిమాలు, సిరీస్ లతో ఆడియన్స్ ని అలరిస్తూ మరోవైపు పలు ఇంట్రెస్టింగ్ షోల తో సైతం ఆకట్టుకుంటూ ఆడియన్స్ నుండి మంచి క్రేజ్ అందుకుంటున్నారు. ఇక ఇటీవల ఆహాలో ప్రసారమైన సర్కార్ మూడు సీజన్స్ కూడా ఆడియన్స్ ఎంతో ఆకట్టుకుని మంచి పేరు సొంతం చేసుకున్నాయి.

విషయం ఏమిటంటే, బుల్లితెర పై యాంకర్ గా మంచి క్రేజ్ అందుకుంటూ అటు సినిమాల్లో హీరోగా సైతం నటిస్తూ దూసుకెళ్తున్న సుడిగాలి సుధీర్ సర్కార్ సీజన్ 4 కి హోస్ట్ గా వ్యవహరించనున్నారు. ఈ విషయాన్ని తాజాగా ఆహా వారు ఒక పోస్టర్ ద్వారా అనౌన్స్ చేసారు. పలు ట్విస్ట్ లు అలానే ఛాలెంజ్ లతో సాగే ఈ షో యొక్క తాజా సీజన్ ని మరింత ఇంట్రెస్టింగ్ గా సిద్ధం చేశారట మేకర్స్. మొత్తంగా సర్కార్ సీజన్ 4 ఆడియన్స్ కి బాగా ఎంటర్టైన్మెంట్ అందించడం ఖాయం అంటున్నారు. త్వరలో దీనికి సంబంధించి మరిన్ని అప్ డేట్స్ వరుసగా రానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు