ట్రైలర్: సాఫ్ట్ వేర్ సుధీర్- సుధీర్ మాస్ హీరో రేంజ్ లో…!

software

జబర్ధస్త్ గ్యాంగ్ లోనుండి మరో హీరో దిగిపోయాడు. జబర్దస్త్ తో పాటు ఢీ వంటి కార్యక్రమాలతో బుల్లితెర ప్రేక్షకులకు బాగా పరిచయమున్న సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న చిత్రం సాఫ్ట్ వేర్ సుధీర్. శేఖర ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్ పై పి రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర ట్రైలర్ నేడు విడుదలైంది. మాస్ హీరో రేంజ్ ఫైట్స్, బిల్డ్ అప్స్ తో పాటు, మంచి పంచులతో కూడిన హాస్యంతో సాగిన ట్రైలర్ బాగుంది.

‘ఐరన్‌ మాన్‌కి అక్కలాగా, డైనోసార్‌ డాటర్‌లా ఉన్నావ్‌ నువ్వు కోచా’, ‘నీ ఫేస్‌కి గేసే పడరు…దాని గ్రేస్‌ చూశావా..’ , ‘హలో రావుగారు చీపురు చూపించి కేజ్రీవాల్‌గారు సీఎం అయ్యారు, ఛాయ్‌ వాలా దేశానికి పీఎం అయ్యారు నేను ట్రై చేస్తే ఆ అమ్మాయికి బిఎఫ్‌ అవ్వలేనా’, ‘చంద్రబాబు ఇంటూ చంద్రశేఖర్‌రావు ఈక్వల్‌ టూ చందు అని మా ఫ్రెండ్స్‌ అంటుంటారు’ అంటూ తనదైన కామెడీ టైమింగ్‌లో సుధీర్‌ చెప్పే డైలాగ్‌లు టీజర్ లో బాగా పేలాయి. సుధీర్ కి జంటగా ధన్య బాలకృష్ణ నటిస్తుండగా నాజర్,ఇంద్రజ, పోసాని, లేటు శివప్రసాద్, సాయాజీ షిండే నటించారు.

ట్రైలర్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version