ఈ రెండు ఓటిటి ప్లాట్ ఫామ్ లలో మంచి రెస్పాన్స్ తో “శ్రీరంగనీతులు”

ఈ రెండు ఓటిటి ప్లాట్ ఫామ్ లలో మంచి రెస్పాన్స్ తో “శ్రీరంగనీతులు”

Published on May 30, 2024 2:33 PM IST

టాలీవుడ్‌లో తన టాలెంట్ సహజ నటనతో తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న హీరో సుహాస్ ఇప్పుడు వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ఇటీవలే అంబాజీపేట మ్యారేజి బ్యాండ్, ప్రసన్నవదనం సినిమాలు సూపర్ హిట్స్ అయ్యాయి. ఇప్పుడు ఆయన నటించిన మూవీ “శ్రీరంగనీతులు”. ఇప్పుడు రెండు స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ లు అమెజాన్ ప్రైమ్, ఆహా ఓటీటీలో సక్సెస్ ఫుల్ గా స్ట్రీమ్ అవుతోంది.

ఈ సినిమాలో సుహాస్ తో పాటు కేరాఫ్ కంచరపాలెం తో ఆకట్టుకున్న కార్తీక్‌ర‌త్నం, బేబీ తో యూత్ లో ఫాలోయింగ్ తెచ్చుకున్న విరాజ్ అశ్విన్‌, రుహానిశ‌ర్మ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ నలుగురి పెర్ఫార్మెన్స్ శ్రీరంగనీతులు సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. యూనిక్ కంటెంట్ తో డిఫరెంట్ స్క్రీన్ ప్లే తో రూపొందిన ఈ చిత్రానికి వీఎస్ఎస్ ప్రవీణ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి ఓటీటీ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ ని అందుకుంటుంది. అలాగే థియేటర్స్ లో చూసిన వారు మరికొందరికి ఈ చిత్రాన్ని ఓటిటిలో మిస్ కావద్దని సజెస్ట్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు