ఈ ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన సుహాస్ థ్రిల్లర్ “ప్రసన్నవదనం”

ఈ ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన సుహాస్ థ్రిల్లర్ “ప్రసన్నవదనం”

Published on May 23, 2024 9:00 AM IST

నటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకుని ఇప్పుడు హీరోగా కూడా మంచి సినిమాలు తెలుగు ఆడియెన్స్ కి అందిస్తున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సుహాస్. మరి తాను నటించిన రీసెంట్ మరో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రమే “ప్రసన్నవదనం”. ఇటీవల డీసెంట్ బజ్ నడుమ వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసింది.

ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఆహా వారు సొంతం చేసుకోగా అందులో ఈ చిత్రం ఇప్పుడు గోల్డ్ సబ్ స్క్రైబర్స్ కి అందుబాటులోకి వచ్చేసింది. అలాగే మిగతా వారికి రేపటి నుంచి అందుబాటులో ఉండనుంది. ఇక ఈ చిత్రానికి సుకుమార్ శిష్యుడు అర్జున్ వై కే దర్శకత్వం వహించగా రాశి సింగ్, పాయల్ రాధాకృష్ణ ఫీమేల్ లీడ్ లో నటించారు. అలాగే విజయ్ బుల్గానిన్ సంగీతం అందించగా లిటిల్ థాట్ సినిమాస్ వారు నిర్మాణం వహించారు.

సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు