ఈమధ్య ఓటీటీల ద్వారా విడుదలైన తెలుగు సినిమాల్లో ‘కలర్ ఫోటో’ మంచి విజయాన్ని అందుకుంది. చిన్న సినిమాగా వచ్చి ప్రేక్షకులను పెద్ద స్థాయిలోనే మెప్పించింది. ఆహా ఓటీటీ ద్వారా విడుదలైన ఈ సినిమా మంచి ప్రాఫిటబుల్ ప్రాజెక్ట్ అయింది. ఈ సినిమాతో సహాయ నటుడిగా ఉన్న సుహాస్ హీరోగా పరిచయమయ్యాడు. ఇందులో అతని సహజసిద్ధమైన నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ విజయంతో ఆయన కెరీర్ అనూహ్యమైన మలుపు తిరిగింది.
ఈ సినిమా విడుదలయ్యాక అతనికి హీరోగా ఆఫర్లు రావడం మొదలైంది. ఇండస్ట్రీ సర్కిల్స్ సమాచారం మేరకు ప్రజెంట్ సుహాస్ చేతిలో నాలుగైదు సినిమాలున్నట్టు తెలుస్తోంది. దాదాపు అన్నీ యువ దర్శకుల సినిమాలేనని, అందులో డెబ్యూ దర్శకులు కూడ ఉన్నారని తెలుస్తోంది. సుహాస్ సైతం చాలా జాగ్రతగా కెరీర్ ప్లాన్ చేసుకుంటున్నాడు. ‘కలర్ ఫోటో’ తరహాలోనే సినిమాలు ఎంచుకుంటున్నారట. ఇంకో రెండేళ్ల వరకు ఆయన ఫుల్ బిజీ అంటున్నారు. మరి హిట్ సినిమా పవర్ అలానే ఉంటుంది. ఎన్నో ఏళ్ల శ్రమకు ఫలితం ఒక్క రోజులోనే దక్కుతుంది.
