అభిమాన నటుడిని ఇంట‌ర్వ్యూ చేసిన సుహాస్

అభిమాన నటుడిని ఇంట‌ర్వ్యూ చేసిన సుహాస్

Published on Jun 11, 2024 1:00 PM IST

విల‌క్ష‌ణ న‌టుడు విజయ్ సేతుప‌తి న‌టించిన లేటెస్ట్ మూవీ ‘మ‌హారాజ’ అన్ని ప‌నులు ముగించుకుని రిలీజ్ కు రెడీ అయ్యింది. ఈ సినిమాను త‌మిళంతో పాటు తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నారు. ఓ మంచి స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ డ్రామాగా ఈ సినిమా వ‌స్తుండ‌టంతో ప్రేక్ష‌కుల్లో ఈ మూవీపై మంచి అంచ‌నాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ చిత్రానికి సంబంధించిన ప్ర‌మోష‌న్స్ లో చిత్ర యూనిట్ బిజీగా ఉంది.

తాజాగా ఈ సినిమా తెలుగు ప్ర‌మోష‌న్స్ లో భాగంగా న‌టుడు సుహాస్ విజ‌య్ సేతుప‌తిని ఇంట‌ర్వ్యూ చేశారు. దీనికి సంబంధించిన ప్రోమో వీడియోను మేక‌ర్స్ తాజాగా రిలీజ్ చేశారు. త‌నకు సినిమాల్లో ఇన్స్ పిరేష‌న్ విజ‌య్ సేతుప‌తి అని చెప్పే సుహాస్, త‌న అభిమాన న‌టుడిని ఇంట‌ర్వ్యూ చేయ‌డంతో, ఈ వీడియోపై ప్రేక్ష‌కుల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యింది.

ఇక పూర్తి వీడియోను చూసేందుకు ఆడియెన్స్ ఎదురుచూస్తున్నారు. కాగా, ‘మ‌హారాజ’ సినిమాను నిథిల‌న్ సామినాథ‌న్ డైరెక్ట్ చేయ‌గా, అజ‌నీశ్ లోక్నాథ్ సంగీతం అందించారు. ఈ సినిమాలో మ‌మ‌తా మోహ‌న్ దాస్, అభిరామి, అనురాగ్ క‌శ్య‌ప్ త‌దిత‌రులు ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ సినిమాను జూన్ 14న రిలీజ్ చేసేందుకు మేక‌ర్స్ రెడీ అయ్యారు.

వీడియో కోసం క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు