క్రైమ్, యాక్షన్ అంశాలతో ఆకట్టుకుంటున్న సుహాస్ ‘ప్రసన్నవదనం’ ట్రైలర్

క్రైమ్, యాక్షన్ అంశాలతో ఆకట్టుకుంటున్న సుహాస్ ‘ప్రసన్నవదనం’ ట్రైలర్

Published on Apr 26, 2024 8:48 PM IST

క‌ల‌ర్ ఫొటో మూవీ ద్వారా హీరో0గా మారిన సుహాస్ ఆ మూవీతో మంచి విజయం అందుకున్నారు. అనంతరం మంచి విజయాలతో దూసుకుపోతున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనం మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వస్తున్నారు. ఓ కొత్త పాయింట్ తో ప్రేక్ష‌కుల ముందుకు వస్తున్న ఈ మూవీలో హీరోకి ఫేస్ బ్లైండ్నెస్‌ ఉంటుంది, అంటే అతడు ఎదుటివారి మొహాల్ని గుర్తించ‌లేడు. ఆఖ‌రికి అద్దంలో త‌న మొహం కూడా చూసుకోలేని పరిస్థితి అతనిది.

అర్జున్ వైకే ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈమూవీని మ‌ణికంఠ‌, ప్ర‌సాద్ రెడ్డి నిర్మాత‌లు. ఈ మూవీని మే 3న విడుద‌ల చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ తో ఆకట్టుకున్న ఈ మూవీ నుండి నేడు థియేట్రికల్ ట్రైలర్ ని రిలీజ్ చేసారు. కాగా ప్ర‌స‌న్న‌వ‌ద‌నం ట్రైలర్ చూస్తే ఇదో క్రైమ్ థ్రిల్ల‌ర్ అనే విష‌యం అర్థం అవుతుంది. ముందు సూర్య‌గా సుహాస్‌ పాత్ర‌ని ప్ల‌జెంట్ గా ప‌రిచ‌యం చేసుకొంటూ, త‌న‌కున్న స‌మ‌స్య చెప్పే ప్ర‌య‌త్నం, అనంతరం అతడి ప్రేమ‌క‌థ‌, తరువాత మూడు మ‌ర్డ‌ర్ కేసుల్లో ఇరుక్కొవడం చూపించారు.

మరి ఫేస్ బ్లైండ్‌నెస్ ఉన్న హీరో ఆ మ‌ర్డ‌ర్ కేసుల్లోంచి ఎలా త‌ప్పించుకొన్నాడు, అస‌లు హంత‌కుడ్ని చ‌ట్టానికి ఎలా అప్ప‌గించాడనేదే అసలు క‌థ‌ అని తెలుస్తోంది. ఇక ట్రైల‌ర్ స్ట‌న్నింగ్ గా ఉంది. విజువ‌ల్స్ ఇంపాక్ట్ ని క్రియేట్ చేశాయి. వీటితో పాటు కామెడీ అంశాలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సుహాస్ యాక్టింగ్, డైలాగ్స్ కూడా అలరించాయి. మొత్తంగా ప్రసన్నవదనం ట్రైలర్ ఆకట్టుకుంటూ మూవీ పై బాగా అంచనాలు పెంచేసింది. మరి రిలీజ్ అనంతరం ఈ మూవీ బాక్సాఫీసు ద‌గ్గ‌ర ఎంతమేర విజయం అందుకుంటుందో చూడాలి.

ట్రైలర్ వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు