మా హీరోలు ఇప్పటికీ అదృష్టవంతులే – సుహాసిని

suhasini
ఒక దశాబ్ద కాలం పాటు తెలుగు తెరపై హీరోయిన్ గా ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులను మెప్పించిన సుహాసిని ప్రస్తుతం తెలుగు సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తోంది. ఒకప్పుడు టాప్ హీరోల అందరి సరసన సుహాసిని నటించింది. సుహాసిని ‘సచిన్(టెండూల్కర్ కాదు)’ అనే సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.

సుహాసినిని మీతో పనిచేసిన హీరోలు ఇంకా హీరోలుగానే ఉన్నారు.. వాళ్ళని చూస్తే మీకేమనిపిస్తుంది? అని అడిగితే ‘ ఒక్క అంబరీష్, చిరంజీవి మాత్రం కేంద్ర మంత్రులైపోయారు. అందుకే వాళ్ళని కలిసినప్పుడల్లా ఏం మినిస్టర్ అని ఆటపట్టిస్తుంటాం. అలాగే తాజాగా బాలయ్య కూడా ఎమ్మెల్యే అయ్యాడు. కనిపిస్తే ఆయన్ని కూడా ర్యాగింగ్ చేయాలి. ఇక మిగిలిన రజినీ, కమల్ లాంటి వారు ఇప్పటికీ సూపర్ స్టార్సే. నిజంగా అప్పటి మా హీరోలు అదృష్టవంతులు. వాళ్ళు కలిసినప్పుడు కూడా మాతో పనిచేయడమే సౌకర్యం అని చెబుతుంటారని’ సమాదానం ఇచ్చింది.

Exit mobile version