సుహాస్ బర్త్‌డే స్పెషల్: ‘మండాడి’ పోస్టర్ రిలీజ్.. సెప్టెంబర్ 10న విడుదల

సుహాస్ బర్త్‌డే స్పెషల్: ‘మండాడి’ పోస్టర్ రిలీజ్.. సెప్టెంబర్ 10న విడుదల

Published on Aug 19, 2026 8:00 AM IST

​సుహాస్, సూరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘మండాడి’ నుంచి ప్రత్యేక పోస్టర్‌ విడుదలైంది. సుహాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ పోస్టర్‌ను పంచుకున్న చిత్రబృందం, సినిమాను సెప్టెంబర్ 10న థియేటర్లలోకి తీసుకురానున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

​మతిమారన్ పుగళేంది దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ పతాకంపై ఎల్రెడ్ కుమార్ నిర్మిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్ ఈ చిత్రానికి క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. మహిమా నంబియార్ కథానాయికగా నటిస్తుండగా.. సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

తాజాగా విడుదల చేసిన పోస్టర్‌లో సుహాస్ సరికొత్త లుక్‌లో కనిపిస్తున్నారు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలతో పాటు బోట్ సీక్వెన్స్ ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని చిత్ర యూనిట్ పేర్కొంది.

​జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఎస్.ఆర్. కథిర్ సినిమాటోగ్రఫీ, ప్రదీప్ ఇ. రాఘవ్ ఎడిటింగ్ అందిస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సెప్టెంబర్ 10న విడుదల కానున్న ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్‌పీ విడుదల చేస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు