డార్లింగ్ ఫ్యాన్స్ సాహో మరో మారు చూడండి- సుజీత్

డార్లింగ్ ఫ్యాన్స్ సాహో మరో మారు చూడండి- సుజీత్

Published on Sep 3, 2019 3:10 PM IST

సాహో విడుదలైన మొదటి రోజు నుండే ప్రభాస్ ఫ్యాన్స్, మూవీ లవర్స్ డైరెక్టర్ సుజీత్ నే టార్గెట్ చేశారు. మూవీకి వచ్చిన టాక్ కి పూర్తి బాధ్యుడిగా సుజీత్ ని చేయడం జరిగింది. అంత పెద్ద సినిమా బాధ్యత అప్పగిస్తే నాశనం చేశాడంటూ మండిపడ్డారు.కాగా మూవీ విడుదలై నాలుగు రోజుల తరువాత సుజీత్ ఈ విషయంపై స్పందించారు.

ఆయన ప్రభాస్ ఫ్యాన్స్ కి, సినీ అభిమానులకు కొంచెం భావోద్వేగంగా సమాధానం ఇవ్వడానికి ప్రయత్నించాడు. తన గత కాలపు విజయాల్ని పరిచయం చేసిన సుజీత్, సాహో చిత్రాన్ని మరో సారి చూడాల్సిందిగా వేడుకున్నాడు. సాహో చిత్రంలోని గొప్ప స్క్రీన్ ప్లే, అలాగే మేము పడ్డ కష్టం తెలియాలంటే మీరు మరొక్క మారు థియేటర్లకు వెళ్లి చూడాలని మనవి చేశాడు. భారీ అంచనాలతో సినిమా చూడడం వలనే సాహో చిత్రం నచ్చడం లేదని అభిప్రాయపడ్డాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు