సుజీత్ ఆరోగ్యం బాగానే ఉంది.. నో ప్రాబ్లమ్

సుజీత్ ఆరోగ్యం బాగానే ఉంది.. నో ప్రాబ్లమ్

Published on Sep 8, 2019 4:58 PM IST

‘సాహో’ సినిమాతో వార్తల్లో నిలిచిన దర్శకుడు సుజీత్. ఈ చిత్రంతో తెలుగులో ఎలా ఉన్నా హిందీలో సుజీత్ పేరు మారుమోగిపోతోంది. చిన్న వయసులోనే అంత పెద్ద భారీ బడ్జెట చిత్రాన్ని హ్యాండిల్ చేయడం పట్ల ఆయన్ను అందరూ అభినందిస్తున్నారు. ఇదిలా ఉండగా నిన్నటి నుండి సుజీత్ ఆరోగ్యం బాగోలేదని, ఆయనకు డెంగ్యూ సోకిందని వార్తలు వచ్చాయి.

కొందరైతే సుజీత్ ఇంకో పదిరోజుల పాటు ఆసుపత్రిలోనే ఉండాలని చెప్పుకొచ్చారు. అసలే నగరంలో విషజ్వరాలు ఎక్కువైన నెపథ్యంలో ఈ వార్తల్ని జనం ఈజీగానే నమ్మేశారు. కానీ సన్నిహిత వర్గాలు మాత్రం సుజీత్ ఆరోగ్యం బాగానే ఉందని, ఆయనకు డెంగ్యూ సోకలేదని, ఏదో చిన్నపాటి జ్వరమైతే వచ్చిందని అంటున్నాయి. మరి వాస్తవవిషయం ఏమిటో తెలియాలంటే ఇంకొన్ని సుజీత్ నుండి క్లారిఫికేషన్ వచ్చే వరకు ఆగాల్సిందే.ఇకపోతే సుజీత్ తన తర్వాతి సినిమా ఏమిటనేది ఇంకా ప్రకటించాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు