ఓజీ టైటిల్ వెనుక కథ ఇదే

ఓజీ టైటిల్ వెనుక కథ ఇదే

Published on May 27, 2024 7:00 AM IST

పవర్‌ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో, యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ఓజీ. దర్శకుడు సుజీత్ ఓజీ సినిమాకి ఈ టైటిల్ ను పెట్టడం వెనుక ఉన్న ఉద్దేశాన్ని చెప్పుకొచ్చాడు. సుజీత్ మాట్లాడుతూ.. ‘ఓజీ అంటే ఓజాస్ గంభీర్ అని అర్థం. సినిమాలో ఓజాస్ అంటే మాస్టర్ పేరు, గంభీర్ అంటే హీరో పేరు. రెండూ కలిపితే ఓజీ అని వస్తుంది’ అంటూ సుజీత్ చెప్పుకొచ్చాడు.

కాగా పవన్ తో జపాన్ స్టయిల్ లో సినిమా చేయాలని ఎప్పట్నుంచో ఫిక్స్ అయ్యాను. అదే ఓజీ’ అంటూ సుజీత్ తెలిపాడు. కాగా ఈ చిత్రం లో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా, ఇమ్రాన్ హష్మీ, అర్జున్ దాస్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం డివివి ఎంటర్ టైన్మెంట్ పై డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. పార్ట్-1 రిలీజ్ తర్వాత రెండో పార్ట్ కూడా ఉండే అవకాశం ఉంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టర్ గా నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు