వైరల్ పిక్ : సోషల్ మీడియాని షేక్ చేస్తున్న తన “ఓజి”తో సుజీత్ పిక్

వైరల్ పిక్ : సోషల్ మీడియాని షేక్ చేస్తున్న తన “ఓజి”తో సుజీత్ పిక్

Published on Feb 16, 2024 7:04 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా యంగ్ హీరోయిన్ ప్రియాంకా మోహన్ హీరోయిన్ గా దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న సాలీడ్ యాక్షన్ డ్రామా “ఓజి” కోసం అందరికీ తెలిసిందే. మరి పవన్ కెరీర్ లోనే భారీ హైప్ ని సెట్ చేసుకున్న ఈ సినిమా రీసెంట్ గానే క్రేజీ పోస్టర్ తో రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. అయితే ఇప్పుడు సుజీత్ పెట్టిన ఓ పిక్ అయితే సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. తాను లేటెస్ట్ గా తన ఇన్స్టాగ్రామ్ లో తన డీపీ అప్డేట్ చేసాడు.

ఇందులో సుజీత్ తన ఓజి తో కనిపిస్తున్నాడు. అయితే ఇందులో ఏమంత స్పెషల్ ఉందా అంటే ఉందనే చెప్పాలి. పవన్ తాను ఏమి నార్మల్ గా కనిపించలేదు. సుజీత్ ని ఒక తన ఫ్రెండ్ లా తన భుజాలపై చెయ్యేసి దగ్గరగా తీసుకొని నడుస్తున్నట్టుగా కనిపిస్తుంది. దీనితో ఈ క్రేజీ పిక్ ని తాను డీపీ పెట్టుకోగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక పవన్ ఫ్యాన్స్ ఇలాంటి ఒక ఉహించని పిక్ చూడడంతో వాళ్ళ ఆనందంకి అవధులు లేకుండా పోయాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు