ప్రేయసితో పెళ్ళికి సిధ్దమైన సాహో డైరెక్టర్..!

Published on Jun 3, 2020 9:38 am IST

యంగ్ డైరెక్టర్ సుజీత్ త్వరలో పెళ్లి చేసుకోనున్నాడు. ఆయనకు తన ప్రేయసి ప్రవల్లికతో జూన్ 10న ఎంగేజ్మెంట్ జరగనుంది. ఇక ప్రవల్లిక వృత్తి రీత్యా డాక్టర్ అని తెలుస్తుంది. అలాగే ఆమె టిక్ టాక్ వీడియోలలో కూడా బాగా ఫేమస్ అట. కొంత కాలంగా ప్రేమలో ఉన్న వీరిద్దరు పెద్దల అనుమతితో పెళ్లి చేసుకోనున్నారు. లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ గా ఇది తెలుస్తుంది.

ఇక గత ఏడాది ప్రభాస్ తో సాహో అనే భారీ పాన్ ఇండియా మూవీ తెరకెక్కించిన సుజీత్, ప్రస్తుతం చిరంజీవి నెక్స్ట్ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ పనులలో ఉన్నారు. చిరంజీవి మలయాళ హిట్ మూవీ లూసిఫర్ తెలుగు రీమేక్ లో నటించాల్సి ఉండగా ఆ మూవీ దర్శకత్వ బాధ్యతలు చిరంజీవి సుజీత్ అప్పగించారు. లూసిఫర్ స్క్రిప్ట్ కి తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా సుజీత్ మార్పులు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More