కన్ఫర్మ్ : సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్..!

కన్ఫర్మ్ : సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్..!

Published on Feb 7, 2015 5:08 PM IST

prabhas-sujith

‘బాహుబలి’ సినిమా తర్వాత యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించబోయే సినిమాపై ఓ క్లారిటీ వచ్చేసింది. ‘రన్ రాజా రన్’ సినిమాతో చిత్ర పరిశ్రమ ప్రముఖులతో పాటు ప్రేక్షకులను ఆకట్టుకున్న యువ దర్శకుడు సుజీత్ చెప్పిన కథకు ప్రభాస్ ఓకే చెప్పారు. ‘మిర్చి’, ‘రన్ రాజా రన్’ సినిమాలను నిర్మించిన యువి క్రియేషన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తుంది. ప్రమోద్, వంశిలు నిర్మాతలు.

2015, మే నెలలో ఈ సినిమా ప్రారంభం అవుతుంది. ప్రభాస్ సరసన కొత్తమ్మాయిని హీరోయిన్ గా తీసుకోవాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. టెక్నీషియన్లు తదితర వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.

ప్రస్తుతం ప్రభాస్ నటించిన ‘బాహుబలి’ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ఏప్రిల్ 17న ‘బాహుబలి’ పార్ట్ 1 విడుదల కానుంది. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమాపై ప్రేక్షకులలో భారి అంచనాలు నెలకొన్నాయి.

తాజా వార్తలు