అల్లు అర్జున్ తన తర్వాతి సినిమాని సుకుమార్ డైరెక్షన్ లో చేస్తున్న సంగతి తెలిసిందే. ‘రంగస్థలం’ తర్వాత సుకుమార్ చేస్తున్న సినిమా కావడంతో అంచనాలు విపరీతంగా ఉన్నాయి. అయితే ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ మొదలైనట్టు వార్తలు వెలువడ్డాయి. దీంతో బన్నీ అభిమానుల్లో కొంత కన్ఫ్యూజన్ నెలకొంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం మేరకు ఇది అసలైన షూట్ కాదని, టెస్ట్ షూట్ మాత్రమేనని తెలుస్తోంది.
సినిమా శేషాచలం అడవుల్లో జరిగే స్మగ్లింగ్ నేపథ్యంలో ఉంటుంది కాబట్టి విజువల్స్ ఎలా ఉంటే బాగుంటుంది అనే విషయం పై ఒక క్లారిటీకి వచ్చేందుకు సుకుమార్ అటవీ ప్రాంతంలో శాంపిల్ షూట్ చేశారట. ఇదంతా సినిమా పర్ఫెక్షన్ కోసమే చేస్తున్నారట. ‘అల వైకుంఠపురములో’ విడుదల తర్వాతే అల్లు అర్జున్ రెగ్యులర్ షూటింగ్లో పాల్గొంటారట. ఇకపోతే ఈ చిత్రంలో బన్నీకి జోడీగా రష్మిక మందన్న నటించనుంది.
