పుష్ప 2 సెట్స్ లో సుకుమార్ పవర్ ఫుల్ పిక్ ను షేర్ చేసిన రష్మిక!

పుష్ప 2 సెట్స్ లో సుకుమార్ పవర్ ఫుల్ పిక్ ను షేర్ చేసిన రష్మిక!

Published on Feb 12, 2024 1:13 PM IST


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో, స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న విలేజ్ యాక్షన్ డ్రామా పుష్ప 2 ది రూల్. ఈ చిత్రం నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి ఆడియెన్స్ నుండి సెన్సేషన్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం కి సంబందించిన షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకున్న టైమ్ కి, ఆగస్ట్ 15 వ తేదీన వరల్డ్ వైడ్ గా భారతీయ ప్రధాన బాషల్లో గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

అయితే ఈ సెట్స్ లో ఒక పవర్ ఫుల్ పిక్ ను హీరోయిన్ రష్మిక షేర్ చేయడం జరిగింది. సింహం విగ్రహం పై కాస్త ఒరిగి ఉన్న డైరెక్టర్ సుకుమార్ ఫోటోను షేర్ చేయడం జరిగింది. ఈ ఫోటో కొద్ది సేపటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జక్కన్న రాజమౌళి తర్వాత, ఆ రేంజ్ క్రేజ్ సొంతం చేసుకున్న డైరెక్టర్లలో సుకుమార్ ఒకరు. శ్రీ వల్లీ పాత్రలో రష్మిక నటిస్తున్న ఈ చిత్రంలో అనసూయ భరద్వాజ్, ధనంజయ, సునీల్, రావు రమేష్, ఫాహద్ ఫజిల్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ భారీ బడ్జెట్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు