‘రావు బహదూర్’ హాలీవుడ్ రేంజ్ మూవీ.. సుకుమార్ ప్రశంసల వర్షం..!

టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ హీరోగా డైరెక్టర్ వెంకటేష్ మహా దర్శకత్వంలో తెరకెక్కిన సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రం ‘రావు బహదూర్’. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్, మూవీ ప్రమోషన్స్‌తో ప్రేక్షకుల్లో నోటెడ్ అయ్యింది. ఇక ఇటీవల ఈ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ సుకుమార్‌కు స్పెషల్ స్క్రీనింగ్ వేశారు మేకర్స్.

ఈ స్క్రీనింగ్ చూసిన సుకుమార్ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇండియన్ సినిమాలో ఇప్పటివరకు ఇలాంటి జోనర్‌ను ఎవరూ ట్రై చేయలేదని.. ప్రేక్షకులకు హాలీవుడ్ స్థాయి అనుభూతిని ఇచ్చేలా మేకర్స్ చేసిన ధైర్యమైన ప్రయత్నం ఇది.. అంటూ సుకుమార్ కొనియాడారు. సత్యదేవ్ యాక్టింగ్, డైరెక్టర్ మేకింగ్ రెండూ అద్భుతంగా ఉన్నాయంటూ ఆయన అభినందించారు.

ఇక ఇటీవలే మహేష్ బాబు కూడా ఈ చిత్రాన్ని ప్రశంసించగా, తాజాగా సుకుమార్ రివ్యూతో జూలై 3న విడుదల కానున్న ఈ సైకలాజికల్ థ్రిల్లర్‌పై అంచనాలు భారీగా పెరిగాయి. అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చింతా గోపాలకృష్ణ రెడ్డి నిర్మించిన ఈ చిత్రాన్ని జిఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పిస్తోంది.

Exit mobile version