రంగస్థలం సినిమాతో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కు సరికొత్త పాఠాలు నేర్పిన దర్శకుడు సుకుమార్ నెక్స్ట్ సినిమాపై అప్పుడే రూమర్స్ మొదలయ్యాయి. ఆయన చేయబోయే నెక్స్ట్ సినిమాలో ఎవరు హీరోగా కనిపిస్తారా అనే విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. అయితే సుకుమార్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తన చేయబోయే తరువాత సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఉంటుందని చెప్పాడు.
ఇదివరకే వీరి కలయికలో 1 నేనొక్కడినే సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మరోసారి డిఫెరెంట్ కాన్సెప్ట్ తో సుక్కు మహేష్ ను కలవనున్నాడట. 2019లో ఆ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. పూర్తి వివరాలను త్వరలో తెలుపుతానని సుక్కు చెప్పాడు. ప్రస్తుతం ఈ న్యూస్ సూపర్ స్టార్ట్ అభిమానులకు మంచి కిక్ ఇస్తోంది. అలాగే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ తన 25వ సినిమా చేయబోతోన్న సంగతి తెలిసిందే. ఇక లేటెస్ట్ ఫిల్మ్ భరత్ అనే నేను 20వ తేదీన రిలీజ్ కాబోతోంది.


