
మ్యాజిక్ స్క్రీన్‌ప్లేతో తెలుగులో టాప్ డైరెక్టర్‌లలో ఒకరుగా పేరు తెచ్చుకున్న సుకుమార్, నిర్మాతగా వినూత్న సినిమాలను తెరకెక్కించే పనిని కూడా చేపట్టిన విషయం తెలిసిందే! ఆ కోవలోనే సుకుమార్ తన సొంత బ్యానర్ సుకుమార్ రైటింగ్స్‌పై మొదటి సినిమాగా ‘కుమారి 21F’ను రూపొందించారు. పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా గత శుక్రవారం పెద్ద ఎత్తున విడుదలైంది. రాజ్ తరుణ్, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ కలెక్షన్స్ తెచ్చిపెడుతూ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది.
ఇక ఈ సందర్భంగా సుకుమార్ మాట్లాడుతూ.. కుమారి 21F’కు వస్తోన్న రెస్పాన్స్ చూస్తే చాలా సంతోషంగా ఉందని. భవిష్యత్‌లో ఇలాంటి మంచి సినిమాలను మరెన్నో తెరకెక్కించేందుకు కృషి చేస్తానని సుకుమార్ స్పష్టం చేశారు. కొత్త దర్శకులతో కొత్తతరం కథల్ని ప్రేక్షకులకు అందించడమే లక్ష్యంగా మొదలుపెట్టిన ఈ సంస్థలో ఇకపై వరుసగా సినిమాలు నిర్మిస్తానని సుకుమార్ తెలిపారు. కుమారి 21F సినిమాలో సుకుమార్ చెప్పిన బోల్డ్ కథాంశానికి యూత్ ఆడియన్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది.

