మొదలైన సుకుమార్ ‘కుమారి 21ఎఫ్’

మొదలైన సుకుమార్ ‘కుమారి 21ఎఫ్’

Published on Nov 9, 2014 12:00 PM IST

kumari-21f

టాలీవుడ్ లో డిఫరెంట్ లవ్ స్టొరీ సినిమాలు తీయడంలో తనకంటూ ప్రత్యేకతను తెచ్చుకున్న డైరెక్టర్ సుకుమార్. సుకుమార్ ‘1-నేనొక్కడినే’ తర్వాత దర్శకుడిగా సినిమా ప్రారంభించనప్పటికీ నిర్మాతగా మారి తన ప్రొడక్షన్ లో వరుసగా సినిమాలను మొదలు పెట్టేస్తున్నాడు. ఇప్పటికే తన స్నేహితుడు వేమారెడ్డి దర్శకత్వంలో వస్తున్న ‘చక్కిలి గింత’ సినిమా స్శూటింగ్ పూర్తయ్యింది.

ఇదిలా ఉండగానే సుకుమార్ తన ప్రొడక్షన్ లో మరో సినిమాని లాంచ్ చేసారు. ‘ఉయ్యాలా జంపాలా’ ఫేం రాజ్ తరుణ్ హీరోగా నటిస్తూ ప్రతాప్ ని దర్శకుడిగా పరిచయం చేస్తున్న సినిమా ఈ రోజు ఉదయం హైదరాబాద్ లో లాంచ్ అయ్యింది. ఈ సినిమాకి ‘కుమారి 21ఎఫ్’ అనే టైటిల్ ని ఖరారు చేసారు. ఈ ముహూర్త కార్యక్రమానికి నాగ చైతన్య, సునీల్, సుశాంత్, ఆది, సుకుమార్, దేవీశ్రీ ప్రసాద్, వంశీ పైడిపల్లి, దిల్ రాజు, అల్లు అరవింద్, సురేందర్ రెడ్డి, రత్నవేలు, బివిఎస్ ఎన్ ప్రసాద్ ముఖ్య అతిధులుగా వచ్చారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ని మొదలు పెట్టి శరవేగంగా షూటింగ్ ఫినిష్ చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు