సుకుమార్ ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేశాడు !

సుకుమార్ ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేశాడు !

Published on Dec 13, 2019 12:54 AM IST

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తన తరువాత సినిమాని అల్లు అర్జున్ తో చేయబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా రివెంజ్ ఫార్ములాతోనే తెరకెక్కబోతుందని తెలుస్తోంది. గతంలో కూడా సుకుమార్ ‘వన్ నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో’ చిత్రాలను కూడా రివెంజ్ ఫార్ములాతోనే తీశారు. ఇప్పుడు కూడా బన్నీతో చేయబోయే సినిమా కూడా రివెంజ్ స్టోరీతోనే చేస్తున్నాడు. అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను సుకుమార్ పూర్తి చేసేశాడట.

కాగా ఈ కథ ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రానుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ క్యారెక్టర్ చాలా రఫ్ గా ఉంటుందని.. అలాగే బన్నీ లుక్ కూడా చాల కొత్తగా ఉండబోతుందట. ఇక ‘రంగస్థలం’ సినిమాతో సూపర్ హిట్ కొట్టి టాప్ డైరెక్టర్ గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న సుకుమార్, రంగస్థలం లాగే ఈ సినిమాతో కూడా సూపర్ హిట్ కొడతాడేమో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు