సుమంత్ ‘ఇదం జగత్’ విడుదల తేదీ ఖరారు !

సుమంత్ ‘ఇదం జగత్’ విడుదల తేదీ ఖరారు !

Published on Nov 16, 2018 10:30 AM IST

Idam Jagath

మళ్ళీ రావా చిత్రం తో చాలా కాలం తరువాత విజయాన్ని అందుకున్న సీనియర్ హీరో సుమంత్ నటించిన తాజా చిత్రం ‘ఇదం జగత్’ విడుదలకు సిద్దమవుతుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం డిసెంబర్ 14న ప్రేక్షకులముందుకు రానుంది. సస్పెన్స్ థ్రిల్లర్ గా రానున్న ఈచిత్రం ఫై సుమంత్ భారీ ఆశలు పెట్టుకున్నాడు. నూతన దర్శకుడు అనిల్ శ్రీకంఠం తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అంజు కురియన్ కథానాయికగా నటిస్తుంది.

గూఢచారి ఫేమ్ శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని జొన్నలగడ్డ పద్మావతీ, గంగపట్నం శ్రీధర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈచిత్రం తో పాటు సుమంత్ నటిస్తున్న 25వ చిత్రం ‘సుబ్రహ్మణ్యపురం’ కూడా డిసెంబర్ 7న విడుదలకానుంది. ఇలా వారం రోజుల వ్యవధిలో రెండు చిత్రాలతో థియేటర్లలో సందడి చేయనున్నాడు సుమంత్.

తాజా వార్తలు