డిఫరెంట్ జోనర్లో సుమంత్ కొత్త సినిమా

Published on May 30, 2019 2:45 pm IST

ప్రముఖ నిర్మాత డి.ఎస్.రావు తన మిత్రుడు పి.జగన్ మోహన్ రావుతో కలిసి సుమంత్ తో ఓ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు.గతంలో ఈయన నితిన్, నాని, నిఖిల్ తదితర హీరోలతో పలు హిట్ చిత్రాలు తీశారు. సంతోష్ కుమార్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ యాక్షన్ డ్రామాలో, సుమంత్ సరసన సిమ్రత్ నటిస్తుండగా, త్వరలోనే సెట్స్ కు వెళ్లనుంది.

“ఈ ప్రపంచంలో ఎవరూ చెడ్డ కాదు. ఎవరూ మంచివారు కాదు. పరిస్థితుల ప్రభావంతోనే మంచివాళ్లుగా, చెడ్డవాళ్లుగా మారతారు” అనే సిద్ధాంతాన్ని ఆధారం చేసుకుని ఈ చిత్రం రూపొందనుందని దర్శకుడు సంతోష్ కుమార్ తెలిపారు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడిస్తామని సంజన ప్రొడక్షన్స్ అధినేత పి.జగన్ మోహన్ రావు అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: యాజమాన్య, సినిమాటోగ్రఫీ: అష్కర్ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More