సుమంత్ హీరోగా నటించిన లేటెస్ట్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘న్యూటన్స్ థర్డ్ లా’ ట్రైలర్ విడుదలై సినిమాపై అంచనాలను పెంచేసింది. హరీష్ కొహిర్కర్ దర్శకత్వంలో ‘ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్’ నిర్మించిన ఈ చిత్రం జులై 31న రిలీజ్ కి సిద్ధమవుతోంది. ఒక హత్య వెనుక ఉన్న నిజాలను బయటకు తీసే క్రమంలో పోలీస్ ఆఫీసర్ వాసుదేవ్‌కి ఎదురయ్యే సవాళ్లు, ఊహించని మలుపులతో ఈ ట్రైలర్ కట్ ఆకట్టుకుంటోంది.
కేవలం క్రైమ్ మిస్టరీగానే కాకుండా ఫ్యామిలీ ఎమోషన్స్, వెన్నుపోటు, దాగి ఉన్న రహస్యాలను కథలో ప్రధానంగా చూపించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో సుమంత్ ఇంటెన్స్ పోలీస్ పాత్రలో ఒదిగిపోగా, జగపతి బాబు తన మార్క్ గంభీరమైన నటనతో సీన్లకు మరింత బలాన్ని చేకూర్చాడు.
దర్శకుడు హరీష్ కొహిర్కర్ అసలు కథేంటో బయటపెట్టకుండా ఆసక్తిని నిలబెట్టడంలో సక్సెస్ కాగా, వేదవ్యాస్ గొట్టిపాటి విజువల్స్ మరియు సింజిత్ యెర్రమిల్లి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ థ్రిల్లింగ్ అనుభూతిని అందించాయి. ప్రతీ ఆధారంతో కొత్త పజిల్ మొదలయ్యేలా ఆకట్టుకుంటున్న ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్, జులై 31న విడుదల కానున్న నేపథ్యంతో ప్రేక్షకులలో మంచి క్యూరియాసిటీని పెంచింది.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి


