ఏప్రిల్ 1న సుమంత్ సినిమా ప్రీ లుక్ !

హీరో సుమంత్ ప్రస్తుతం తన 24వ సినిమా చిత్రీకరణ ముగింపు పనుల్లో ఉన్నారు. నూతన దర్శకుడు అనిల్ శ్రీకంఠం డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రానికి ‘ఇదమ్ జగత్’ అనే టైటిల్ పరిశీలనలో ఉండగా చిత్ర టీమ్ ప్రీ లుక్ ను ఏప్రిల్ 1వ తేదీన ఫస్ట్ లుక్ ను ఏప్రిల్ మొదటి వారంలోను రిలీజ్ చేయాలని నిర్ణయించింది.

అంజు కురియన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో సుమంత్ కొంత నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారు. ఇకపోతే సుమంత్ తమ 25వ చిత్రాన్నిఈ మధ్యనే అనౌన్స్ చేశారు. నూతన దర్శకుడు సంతోష్ జాగర్లపూడి డైరెక్ట్ చేయనున్న ఈ చిత్రానికి ‘సుబ్రమణ్యపురం’ అనే టైటిల్ ను నిర్ణయించారు. ధీరజ్ బొగ్గరం, సుధాకర్ రెడ్డిలు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.