హీరో సుమంత్ నటిస్తున్న తాజా చిత్రాల్లో ‘సుబ్రమణ్యపురం’ కూడ ఒకటి. టారస్ సినీ కార్పొరేషన్ సినీ పతాకంఫై ధీరజ్ బొగ్గరం, బీరం సుధాకర్‌రెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సంతోష్ జాగర్లపూడి డైరెక్ట్ చేస్తున్నారు. అతీంద్రియ అంశాల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది.
ఈ నెల 4న మొదలైన ఈ షూటింగ్ 12వ తేదీ వరకు జరగనుంది. ఇందులో సుమంత్ కార్తిక్ అనే పాత్రలో కనిపించనుండగా ఆయనకు జోడీగా ఈషా రెబ్బ నటిస్తోంది. ఈ ఏడాది రెండవ సగంలో సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. ఇది కాకుండా సుమంత్ చేస్తున్న ‘ఇదం జగత్’ చిత్ర షూటింగ్ ఒక్క పాట మినహా మొత్తం పూర్తైంది.
