టాలీవుడ్‌కు సమ్మర్ సీజన్ ఎప్పుడూ ఒక పెద్ద పండగలాంటిది. కానీ, గత కొన్నేళ్లుగా టాలీవుడ్ ఈ సీజన్‌ను సరిగ్గా ఉపయోగించుకోలేకపోతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. 2026 వేసవి కూడా పెద్ద సినిమాల సందడి లేక, చిన్న సినిమాలు ఆశించిన స్థాయిలో మెప్పించలేక చప్పగానే సాగుతోంది. సరైన ప్రణాళిక లేకపోవడం వల్లే బాక్సాఫీస్ వద్ద ఈ నీరసం కనిపిస్తోందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అయితే, 2027 సమ్మర్ మాత్రం టాలీవుడ్ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచేలా కనిపిస్తోంది. ఈసారి టాప్ హీరోలందరూ బాక్సాఫీస్ బరిలో దిగేందుకు పక్కా ప్లానింగ్‌తో సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా రెబెల్ స్టార్ ప్రభాస్ మరియు సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో వస్తున్న ‘స్పిరిట్’ చిత్రం మార్చి 5న విడుదల కానుంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌తోనే 2027 సమ్మర్ సీజన్‌కు అదిరిపోయే కిక్ స్టార్ట్ లభించబోతోంది.
ఇక వేసవి హీట్‌ను పీక్స్‌కు తీసుకెళ్లేందుకు దర్శకధీరుడు రాజమౌళి సిద్ధమయ్యారు. మహేష్ బాబుతో ఆయన రూపొందిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’ ఏప్రిల్ 7న రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేసుకుంది. సాధారణంగా రాజమౌళి సినిమాలు వాయిదా పడుతుంటాయి అనే టాక్ ఉంది. కానీ, ఈసారి మాత్రం పక్కా షెడ్యూల్ ప్రకారం షూటింగ్ జరుపుకుంటూ చెప్పిన సమయానికే వచ్చేలా జక్కన్న ప్లాన్ చేస్తున్నారు.
ఇక 2027 జూన్ 11న ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబో చిత్రం థియేటర్లలోకి రానుంది. వీరితో పాటు అల్లు అర్జున్ నటిస్తున్న ‘రాకా’ కూడా ఇదే సీజన్‌లో వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ముందుగా సంక్రాంతి అనుకున్నా, షూటింగ్ వేగం దృష్ట్యా వేసవికే షిఫ్ట్ అయ్యే సూచనలు ఉన్నాయి. మొత్తానికి ప్రభాస్, మహేష్, ఎన్టీఆర్, బన్నీ వంటి స్టార్ హీరోలందరూ ఒకే సీజన్‌లో పోటీ పడుతుండటంతో 2027 సమ్మర్ టాలీవుడ్‌కు అసలైన వినోదాన్ని పంచబోతోందని సినీ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు.


