భారీ ధర పలికిన స్టార్ హీరో శాటిలైట్ రైట్స్

Published on Feb 22, 2020 9:50 pm IST

డిజిటల్ మరియు శాటిలైట్ రంగంలోదూసుకుపోతున్న సన్ నెట్వర్క్స్ స్టార్ హీరో సూర్య లేటెస్ట్ మూవీ శాటిలైట్ రైట్స్ భారీ ధర చెల్లించి దక్కించుకున్నారని సమాచారం. సూర్య హీరోగా లేడీ డైరెక్టర్ సుధా కొంగర తెరకెక్కిస్తున్న చిత్రం సూరారై పోట్రు. తెలుగులో ఈ చిత్రం ఆకాశం నీ హద్దురా అనే టైటిల్ తో విడుదల కానుంది. డెక్కన్ ఎయిర్ వేస్ ఫౌండర్ జి ఆర్ గోపినాధ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్ర టీజర్ విడుదలై విశేష ఆదరణ దక్కించుకుంది.

ఈ మూవీపై ఆడియన్స్ లో ఉన్న క్రేజ్ రీత్యా ఫ్యాన్సీ ధరకు సన్ నెట్ వర్క్స్ శాటిలైట్ రైట్స్ దక్కించుకున్నారని వినికిడి. ఆకాశం నీ హద్దురా చిత్రంలో మోహన్ బాబు ఓ కీలక రోల్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం జి వి ప్రకాష్ అందిస్తున్నారు.2020 ఏప్రిల్ 9న తెలుగు మరియు తమిళ భాషలలో ఈ చిత్రం విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :

X
More