“సుందరం మాస్టర్” ఫస్ట్ డే వసూళ్లు ఇవే!

“సుందరం మాస్టర్” ఫస్ట్ డే వసూళ్లు ఇవే!

Published on Feb 24, 2024 6:11 PM IST


ప్రముఖ కమెడియన్ హర్ష చెముడు టైటిల్ రోల్ లో, డైరెక్టర్ కళ్యాణ్ సంతోష్ దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం సుందరం మాస్టర్. ఈ చిత్రం నిన్న థియేటర్ల లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యింది. ఈ చిత్రం తొలి రోజు వరల్డ్ వైడ్ గా రాబట్టిన వసూళ్ల వివరాలను మేకర్స్ సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించారు. ఈ చిత్రం మొదటి రోజు 2.03 కోట్ల రూపాయల గ్రాస్ ను రాబట్టడం జరిగింది.

దివ్య శ్రీపాద, బాలకృష్ణ నీలకంటపు, భద్రం తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు. ఈ చిత్రానికి టాలీవుడ్ స్టార్ హీరో రవితేజ మరియు సుధీర్ కుమార్ లు నిర్మాతలు గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం లాంగ్ రన్ లో ఎలాంటి వసూళ్లను రాబడుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు