‘సుందరం మాస్టర్’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్ డీటెయిల్స్

‘సుందరం మాస్టర్’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్ డీటెయిల్స్

Published on Feb 26, 2024 4:00 PM IST

హర్ష చెముడు ప్రధాన పాత్రలో దివ్య శ్రీపాద హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ మూవీ సుందరం మాస్టర్. ఆర్.టీ. టీం వర్క్స్, గోల్ డెన్ మీడియా బ్యానర్స్ పై మాస్ మహారాజా రవితేజ, సుధీర్ కుమార్ కుర్రు నిర్మించిన ఈ మూవీకి కళ్యాణ్ సంతోష్ దర్శకత్వం వహించారు. ఈ కామెడీ యాక్షన్ మూవీ మొదటి షో నుంచే పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది.

దాంతో ఫస్ట్‌ డే నుండి మంచి కలెక్షన్ తో ఈ మూవీ కొనసాగుతోంది. ఈ మూవీలో సుందరం మాస్టార్‌ పాత్రలో హర్ష చాలా బాగా నటించాడు. ఎమోషనల్ సీన్స్‌లో కంటతడి పెట్టించాడు. ఇక ఈ మూవీ ఫస్ట్ వీకెండ్ రూ. 4. 68 కోట్ల గ్రాస్ కలెక్షన్ సొంతం చేసుకుందని కొద్దిసేపటి క్రితం మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేసారు. మొత్తంగా ఈ కామెడీ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ రాబోయే రోజుల్లో ఇంకెంతమేర కొల్లగొడుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు