సందీప్ కిషన్ హీరోగా భారీ ద్విభాషా చిత్రం..!

సందీప్ కిషన్ హీరోగా భారీ ద్విభాషా చిత్రం..!

Published on Sep 17, 2015 2:10 PM IST

Sundeep_Kishan
సందీప్ కిషన్.. వైవిధ్యభరితమైన కథాంశాలను ఎంపిక చేసుకుంటూ ఇప్పుడున్న యువహీరోల్లో తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు. తాజాగా ‘టైగర్’తో మంచి హిట్ కొట్టిన ఈ హీరో, ఇప్పటికే మరో తమిళ సినిమాను విడుదలకు సిద్ధం చేసేసిన విషయం తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే సందీప్ కిషన్ నటించే మరో కొత్త సినిమా ఈ ఉదయం లాంచ్ అయింది. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో పెద్ద ఎత్తున తెరకెక్కనున్న ఈ సినిమాను స్టూడియో గ్రీన్ సంస్థ, దర్శక నిర్మాత సీవీ రావు నిర్మిస్తున్నారు.

సీవీ రావు స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించనున్న ఈ సినిమా అక్టోబర్ 5 నుంచి సెట్స్‌పైకి వెళ్ళనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవరు నటించనున్నారన్న విషయాన్ని త్వరలోనే ప్రకటిస్తామని సినిమా యూనిట్ తెలిపింది. గిబ్రాన్ ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తున్నారు. గోపీ అమర్‌నాథ్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. లొయో జాన్ ఎడిటర్‌ బాధ్యతలు చేపడుతున్నారు. తెలుగుతో పాటు తమిళంలోనూ మంచి క్రేజ్ సంపాదించుకొని దూసుకెళుతోన్న సందీప్ కెరీర్‌కు ఈ సినిమా మరో సూపర్ హిట్‌గా నిలుస్తుందని సినిమా యూనిట్ ఆశాభావం వ్యక్తం చేసింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు