కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ ని సాధించిన సందీప్ కిషన్

కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ ని సాధించిన సందీప్ కిషన్

Published on Nov 8, 2014 2:57 PM IST

JORU_rw

సందీప్ కిషన్ టాలీవుడ్ లో నెమ్మదిగా పెద్ద అడుగులు వేస్తున్నాడు. అతని తాజా చిత్రాలన్నీ మంచి విజయాన్ని సాధించాయి. నిన్న విడుదల అయిన ‘జోరు’ తో మరోసారి మన ముందుకువచ్చాడు. విమర్శకుల నుంచి మంచి స్పందన రాకపోయినప్పటికీ చాలా చోట్ల హౌస్ ఫుల్ అయ్యింది. మార్నింగ్ షో నుంచి ప్రతి షో కి90 శాతం ఆక్యుపెన్సీ సాధించి సందీప్ కిషన్ కెరీర్ లోనే ‘జోరు’ పెద్ద రిలీజ్ గా నిలిచింది.

సందీప్ కిషన్ గతంలో రెండు హిట్లు సాధించడం రాశి ఖన్న కి వున్న క్రేజ్ ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్స్ రావడానికి ప్రధాన కారణాలు. కుమార్ నాగేంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రం మల్టీప్లెక్స్లతో పాటు సింగల్ స్క్రీన్ లలో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన సందీప్ కిషన్ కెరీర్ లోనే పెద్ద చిత్రం గా నిలిచింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు