యువ హీరోలు సందీప్ కిషన్, రాహుల్ రవీంద్రన్ కలసి నటిస్తున్న సినిమా ‘టైగర్’. మురుగదాస్ శిష్యుడు విఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్లో జరుగుతుంది. సందీప్, రాహుల్ లపై ఓ పాటను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో వీరిద్దరూ కలసి నృత్యం చేస్తున్న మొదటి పాట ఇది.
ఇద్దరు అగ్ర నిర్మాతలు ఎన్వీ ప్రసాద్, ఠాగూర్ మధు సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమాలో సీరత్ కపూర్ హీరోయిన్. గంగ పాత్రలో నటిస్తుంది. సప్తగిరి, సుప్రీత్, తనికెళ్ల భరణి, పృథ్వీరాజ్, ప్రవీణ్, కాశీ విశ్వనాథ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. యాక్షన్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే వారణాసిలో ఓ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. గంగానది నేపథ్యంలో విభిన్న కథాంశంతో ఈ సినిమా రూపొందుతుంది.
సినిమాటోగ్రాఫర్ చోటా కె నాయుడు, సంగీత దర్శకుడు తమన్, మాటల రచయిత అబూరి రవి వంటి టాప్ టెక్నీషియన్లు ఈ సినిమాకు వర్క్ చేస్తున్నారు.


