కామెడీ-లవ్ సమానంగా ఉంటుందన్న ‘రారా కృష్ణయ్య’

sandeep-kishan-twitt
‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను నవ్వించిన యంగ్ హీరో సందీప్ కిషన్ త్వరలోనే ‘రారా కృష్ణయ్య’గా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. సందీప్ కిషన్ సరసన రెండవసారి రెజీన కసాండ్ర హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో సందీప్ కిషన్ కి అన్నాగా పూర్తి మాస్ లుక్ లో జగపతి బాబు కనిపించనున్నాడు.

రేపు అనగా మే 28న ఈ సినిమా ఆడియో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా రారా కృష్ణయ్య సినిమా ఎలా ఉంటుందనేది చెప్పాడు. ‘నా మొట్ట మొదటి లవ్ స్టొరీ ‘రొటీన్ లవ్ స్టొరీ’. ఆ సినిమాలో ఎక్కువ కామెడీ లవ్ తక్కువ ఉంటుంది. కానీ రారా కృష్ణయ్యలో కామెడీ-లవ్ సమానంగా ఉంటుందని’ ట్వీట్ చేసాడు.

మహేష్ బాబు డైరెక్టర్ గా పరిచయం అవుతున్న ఈ సినిమాని కృష్ణ శ్రీనివాస్ నిర్మించారు. అచ్చు సంగీతం అందిస్తున్న ఈ సినిమా జూన్ 2వ వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Exit mobile version