సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా హీరో-హీరోయిన్గా నటించిన లేటెస్ట్ యాక్షన్ అడ్వెంచర్ కామెడీ చిత్రం ‘సిగ్మా’. ప్రముఖ కోలీవుడ్ హీరో, తమిళనాడు సీఎం విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతుండగా, లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. తాజాగా ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
ట్రైలర్‌ను పరిశీలిస్తే.. డ్రగ్స్, డ్రగ్స్ కింగ్‌పిన్ నేపథ్యంలో సాగే హై-స్టేక్స్ యాక్షన్ డ్రామాగా, ట్రెజర్ హంట్ మరియు ఆకట్టుకునే హీస్ట్ సన్నివేశాలతో సినిమా రూపొందినట్లు స్పష్టమవుతోంది. స్టైలిష్ విజువల్స్, అద్భుతమైన ఫైట్ సీక్వెన్సెస్ ట్రైలర్లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఈ సినిమాలో రాజు సుందరం, అన్బు దాసన్, సంపత్ రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తుండగా, కేథరిన్ థ్రెసా ఒక మాస్ సాంగ్‌లో స్పెషల్ క్యామియో ఇవ్వనుంది.
ట్విస్టులు, థ్రిల్స్‌తో నిండిన ఈ మల్టీలాంగ్వేజ్ చిత్రాన్ని అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ, పంపిణీ సంస్థలైన మైత్రీ డిస్ట్రిబ్యూటర్స్, ఎన్వీఆర్ సినిమా సంయుక్తంగా విడుదల చేయనున్నాయి.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
