
‘రా రా కృష్ణయ్య’, ‘జోరు’ సినిమాలు ఆశించిన విజయం సాధించాపోయినా, బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబట్టాయి. యంగ్ హీరో సందీప్ కిషన్ కు మంచి మార్కెట్ ఉందని నిరూపించాయి. వినూత్న కథాంశంతో సందీప్ కిషన్ నటించిన తాజా సినిమా ‘బీరువా’ ఈ నెల 23న విడుదలవుతుంది. ఈ సినిమా విజయంపై నమ్మకంగా ఉన్న సందీప్ కిషన్, గుంటూరు డిస్ట్రిబ్యూషన్ హక్కులు సొంతం చేసుకున్నారు. తన మిత్రుడితో కలిసి గుంటూరులో సినిమాను స్వయంగా విడుదల చేస్తున్నారు.
ఆదివారం మీడియాతో సందీప్ కిషన్ మాట్లాడుతూ.. అవుట్ & అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా సినిమాను రూపొందించాం. ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ తర్వాత ఈ సినిమా స్క్రిప్ట్ విన్నాను. వెంటనే సంతకం చేశాను అని వెల్లడించారు. సినిమా విజయంపై ధీమాను వ్యక్తం చేశారు.
సురభి ఈ సినిమా ద్వారా హీరోయిన్ గా తెలుగు చిత్రసీమకు పరిచయం అవుతుంది. ఆర్.కన్మణి దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఆనంది ఆర్ట్స్ మరియు ఉషా కిరణ్ మూవీస్ సంయుక్తంగా నిర్మించాయి.