రాజ్ కిరణ్ తో పనిచేయాలనుకుంటున్న సందీప్ కిషన్

రాజ్ కిరణ్ తో పనిచేయాలనుకుంటున్న సందీప్ కిషన్

Published on Jun 16, 2014 7:13 PM IST

sandeep-kishan-raj-kiran
‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ సినిమా విజయంతో యంగ్ హీరో సందీప్ కిషన్ వరుస సినిమాలతో మరింత బిజీ ఐపోయాడు. సందీప్ కిషన్, రెజీనా కలిసి నటించిన ‘రారా కృష్ణయ్య’ సినిమా త్వరలో విడుదలకు సిద్దమవుతోంది.

సందీప్ కిషన్ ని ఓ అభిమాని మీరు మల్టీ స్టారర్ సినిమాలు చేస్తారా? చేస్తే ఏ హీరోతో వర్క్ చెయ్యాలనుకుంటారు? అని అడిగిన ప్రశ్నకి సందీప్ కిషన్ సమాధానం ఇస్తూ మల్టీ స్టార్ సినిమాలు చేస్తాను, అందులో నేను రాజ్ తరుణ్ తో కలిసి వర్క్ చేయాలనుకుంటున్నాను.

సందీప్ కిషన్ చెప్పిన సమాధానం అందరిని కాస్త సర్ప్రైజ్ చేసింది.. ఎందుకంటే ఇప్పటి యంగ్ స్టార్స్ చాన్స్ దొరికితే బిగ్ స్టార్స్ తో పనిచేయాలనుకుంటున్నారు. కానీ సందీప్ మాత్రం ఉయ్యాల జంపాలా ఫేం రాజ్ తరుణ్ ని సెలక్ట్ చేసుకోవడం కాస్త సర్ప్రైజింగ్ గా అనిపించింది.

అలాగే రారా కృష్ణయ్య సినిమాలో ఉన్న లిప్ లాక్ గురించి అడిగితే ‘రెజీనా నాకు బెస్ట్ ఫ్రెండ్.. అలాంటి తనని సెట్లో అందరి ముందు కిస్ చేయడం కాస్త ఇబ్బందికరమైన విషయమని’ అన్నాడు. మరి ఈ రారా కృష్ణయ్యతో సందీప్ మరో విజయాన్ని అందుకుంటాడేమో చూడాలి..

తాజా వార్తలు