ఇది నిజమైన సక్సెస్ అంటే.. ?

ఇది నిజమైన సక్సెస్ అంటే.. ?

Published on Jul 13, 2019 3:52 PM IST

స్టార్ డమ్ లేని ఒక యంగ్ హీరో.. ఒకే సినిమాతో బాక్సాఫీస్ వద్ద ఆరు రెట్లు ఎదగటం అంటే.. అదీ వరుస ప్లాప్ లతో మార్కెట్ మొత్తం కోల్పోయాక ఎదగటం అంటే.. మాములు విషయం కాదు. విషయంలోకి వెళ్తే.. సందీప్ కిషన్ హీరోగా అన్య సింగ్ హీరోయిన్ గా కార్తీక్ రాజు దర్శకత్వంలో వచ్చిన ‘నిను వీడ‌ని నీడ‌ను నేనే’ చిత్రం బాక్సాఫీస్ వద్ద డీసెంట్ టాక్ తో మంచి కలెక్షన్స్ ను సాధిస్తోంది. అయితే ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ కి, సందీప్ కిషన్ లాస్ట్ రెండు సినిమాల ఫస్ట్ కలెక్షన్స్ కి.. అసలు ఏ మాత్రం పొంతన లేదు.

ఫస్ట్ డే కలెక్షన్స్ లో తన గత సినిమాల కంటే.. సందీప్ కిషన్ ఈ సినిమాతో ఏకంగా ఆరు రెట్లు ఎక్కువ కలెక్షన్స్ ను రాబట్టాడు. మొదటి రోజు ఈ సినిమాకు గ్రాస్ 1.70 కోట్లు వచ్చాయి. ఇప్పటికే అన్ని ఏరియాల్లో శని ఆదివారాల్లో కూడా ఈ సినిమా ప్రీ బుకింగ్ బాగుంది. ఈ సక్సెస్ కి సందీప్ కిషనే ప్రధాన కారణం అని చెప్పాలి. గత ఐదారు సినిమాల నుంచీ సందీప్ కిషన్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలం అయ్యాయి. ఆ సినిమాల అపజయాలకు కారణాలను అర్ధం చేసుకున్న సందీప్ కిషన్.. ఆ సినిమాలకు జరిగిన తప్పులను.. ఈ సినిమాకు జరగకుండా జాగ్రత్త పడ్డాడు.

పైగా అప్పటికే జరిగిన కొన్ని తప్పులను దృష్టిలో పెట్టుకుని దగ్గర ఉండి రీషూట్ కూడా చేయించాడు. ఆ క్రమంలో నిర్మాతగా కూడా మారాడు. తాను అనుకున్న విధంగా సినిమా వచ్చే వరకూ తానే ఖర్చు పెట్టాడు. మొత్తానికి ఆ కష్టం ఫలించింది. సందీప్ కిషన్ సాధించిన ఈ సక్సెస్ నిజంగా మిగిలిన యంగ్ హీరోలకు కూడా ఆదర్శమే అవుతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు