అక్టోబర్ లో రానున్న ‘తెనాలి రామకృష్ణ’ !

అక్టోబర్ లో రానున్న ‘తెనాలి రామకృష్ణ’ !

Published on Sep 2, 2019 3:46 PM IST

యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా కామెడీ చిత్రాల దర్శకుడు జి.నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో రాబోతున్న సినిమా ‘తెనాలి రామకృష్ణ బిఎ.బిఎల్’. కాగా ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే పూర్తి అయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఫుల్ బిజీగా ఉంది ఈ సినిమా. అయితే తాజాగా వినాయక చవితి సందర్భంగా చిత్రబృందం సినిమా విడుదలను నిర్ణయించింది. అక్టోబర్ లో సినిమాని విడుదల చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. అయితే ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ లాంటి ఫుల్ ఎంటర్ టైనర్ తో మంచి హిట్ అందుకున్న సందీప్ కిషన్, మళ్లీ ఆ తరువాత ఆ స్థాయిలో కామెడీ సినిమాను చెయ్యలేదు. అందుకే ఈ సారి ఫుల్ అండ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ సినిమాని చేసి.. సూపర్ హిట్ అందుకోవాలనే ఉద్దేశ్యంతో ఈ ‘తెనాలి రామకృష్ణ’ సినిమాని చేస్తోన్నాడట. ముఖ్యంగా ఈ చిత్రంలో సిచ్యుయేషన్ కామెడీ చాలా బాగా వస్తోందని సమాచారం.

సందీప్ కిషన్ చుట్టూ జరిగే డ్రామా.. ఆ డ్రామా కారణంగా హీరో పడే ఇబ్బందులు.. ఆ ఇబ్బందుల నుండి తప్పించుకోవడానికి హీరో చేసే పనులు.. ఆ పనులకు మిగిలిన పాత్రలు ఎలాంటి సమస్యలను ఎదురుకున్నాయి, లాంటి అంశాల చుట్టూ ఈ సినిమా సాగుతుందట. మొత్తానికి తెనాలి రామకృష్ణ ఫుల్ గా నవ్విస్తాడని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో సందీప్ కిషన్ సరసన హన్సిక కథానాయకిగా నటిస్తోంది. ఎస్ఎన్ఎస్ క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు