మహా శివరాత్రి కానుకగా సందీప్ కిషన్ ‘టైగర్’ ఆడియో

tiger

సినిమా సినిమాకి ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా వరుసగా సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకులను మెప్పించడానికి ట్రై చేస్తున్న యంగ్ హీరో సందీప్ కిషన్. సందీప్ కిషన్ నటించిన బీరువా సినిమా జనవరిలో విడుదలై మంచి విజయాన్నే అందుకుంది. ఈ సినిమా విడుదలై నెల రోజులు కూడా కాకముందే సందీప్ కిషన్ అప్పుడే తన తదుపరి సినిమా ‘టైగర్’ తో రెడీ అయిపోయాడు. సందీప్ కిషన్, రాహుల్ రవీంద్రన్ హీరోలుగా ఏఆర్ మురుగదాస్ శిష్యుడు విఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘టైగర్’.

ఇటీవలే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా ఎక్కువ భాగం కాశీలో షూట్ చేసారు. దాంతో ఈ సినిమా ఆడియో మహా శివరాత్రి కానుకగా రిలీజ్ చెయ్యడానికి ఈ చిత్ర టీం ప్లాన్ చేస్తోంది. ‘టైగర్ కథ కాశీ బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది. అందుకే ఈ సినిమా ఆడియోని శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 17న రిలీజ్ చేయనున్నామని’ సందీప్ కిషన్ తెలిపాడు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సీరత్ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇద్దరు అగ్ర నిర్మాతలు ఎన్వీ ప్రసాద్, ఠాగూర్ మధు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Exit mobile version