మంచు లక్ష్మి మరియు సునీల్ లకు ఉత్తమ సహాయనటులుగా ఫిలింఫేర్ అవార్డ్ ని సొంతం చేసుకున్నారు. 61వ ఐడియా ఫిలింఫేర్ అవార్డుల ప్రధానోత్సవం ప్రస్తుతం చెన్నై జరుగుతుంది.
లక్ష్మికి ‘గుండెల్లో గోదారి’ సినిమాకు గానూ సునీల్ కు ‘తడాఖా’ సినిమాకు గానూ ఈ అవార్డులు వచ్చాయి. ఈ సినిమాను లక్ష్మినే స్వయంగా నిర్మించడంతో ఆమె ఆనందానికి అవధులులేవు.
ఈ వేడుక అంగరంగవైభవంగా జరుగుతుంది. తారల నృత్యప్రదర్శనలతో సెలబ్రిటీలతో స్టేజ్ కళకళలాడుతోంది. వీరిద్దరికీ 123తెలుగు.కామ్ ద్వారా శుభాకాంక్షలు అందజేస్తున్నాం.


