‘పుష్ప’లో సినిమాలో ఈయన కూడ ఒక విలన్ ?

Published on Nov 26, 2020 7:06 pm IST

అల్లు అర్జున్ చేస్తున్న కొత్త చిత్రం ‘పుష్ప’. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే మొదలైంది. ఒక షెడ్యూల్ కూడ ముగిసింది. ఇందులో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరణ చేశారు. తాజా సమాచారం మేరకు ఇందులో సునీల్ నటించనున్నారని తెలుస్తోంది. అది కూడ నెగెటివ్ పాత్రలో చేయనున్నారట. ఈమధ్య సునీల్ ప్రతినాయకుడి పాత్రలను ఎక్కువగా ఎంచుకుంటున్నారు. రీసెంట్ గా ‘కలర్ ఫొటో’లో విలన్ గా కనబడి మెప్పించారు.

ఆమధ్య ‘డిస్కో రాజా’ సినిమాలో కూడ ప్రతినాయకుడిగా నటించారు. ఈ రెండు సినిమాలు కూడ సునీల్ కు మంచి పేరే తెచ్చాయి. అందుకే ‘పుష్ప’ చిత్రంలో కూడ నెగెటివ్ రోల్ చేయించాలని చూస్తున్నారట సుకుమార్. అయితే అది మెయిన్ విలన్ రోల్ కాదట. సినిమాలో ప్రధాన ప్రతినాయకుడితో పాటు ఇంకొన్ని నెగెటివ్ రోల్స్ ఉన్నాయట. అందులో ఒక పాత్రను సునీల్ చేయనున్నారని అంటున్నారు. మరి ఈ వార్త నిజమో కాదో తెలియాలంటే సుకుమార్ టీమ్ స్పందించేవరకు ఆగాల్సిందే. మొదటి వారంలో ఈ సినిమా షూట్ రీస్టార్ట్ కానుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో బన్నీ సరసన రష్మిక మందన్న కథానాయికగా నటిస్తోంది. శేషాచలం అడవుల్లో జరిగే ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో అల్లు అర్జున్ స్మగ్లర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More