ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమాలో సునీల్ పాత్ర అదే !

30th, March 2018 - 11:58:58 AM

సునీల్ కమెడియన్ గా వరుస సినిమాలు చెయ్యబోతున్నాడు. త్రివిక్రమ్, ఎన్టీఆర్ సినిమాలో సునీల్ సెక్యూరిటి ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాతో పాటు శ్రీను వైట్ల దర్శకత్వంలో రవితేజ చేస్తున్న మూవీలో సునీల్ ఫుల్ లెంగ్త్ పాత్రలో కనిపించబోతున్నాడు.

హీరోగా వరుస సినిమాలు చేసినప్పటికీ పెద్దగా సక్సెస్ కాకపోవడంతో మళ్ళీ పాత పద్దతినే ట్రై చేస్తున్న సునీల్ నమ్మకమున్న కథ దొరికితే హీరోగా నటించే ఆలోచనలో ఉన్నాడు. అందుకే ‘పూలరంగడు’ దర్శకుడు వీరభద్రం చౌదరి దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. ఈ సినిమా గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.